కొస్లీ గ్రామం పశువుల ఆసుపత్రి వద్ద బీర్ సీసాలు.. శుభ్రతపై ఆందోళన

    నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండలం:- కొస్లీ గ్రామంలోని పశువుల ఆసుపత్రి సమీపంలో ఖాళీ బీర్ సీసాలు పడేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి పరిసరాల్లో మద్యం సీసాలు అక్కడక్కడా పడేయడం వల్ల స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
    పర్యావరణానికి కాలుష్యం కలిగిస్తున్న ఈ చర్యపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు.
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :