
కె24న్యూస్ తెలుగు జూలై 26. గంగాధరనెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లం గ్రామంలో ప్రభుత్వ విప్ మరియు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ వి.ఎం థామస్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం ఇంటింటి ప్రచారా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యులు డాక్టర్ వి.ఎం.థామస్ ఇంటింటికీ తిరిగి కూటమి ప్రభుత్వం రెండేళ్ల కాలంలోని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జి.డి నెల్లూరు నియోజకవర్గం ఇంచార్జి డాక్టర్ పొన్నా యుగంధర్, తెలుగుదేశం నియోజకవర్గ అబ్జర్వర్ జయ ప్రకాష్, ఏఎంసీ చైర్మన్ జయంతి గుండయ్య, తెలుగుదేశం మండల అధ్యక్షులు గురుసాల కిషన్ చంద్, బిజెపి మండల అధ్యక్షుడు అశోక్ రెడ్డి, జనసేన మండల అధ్యక్షుడు పురుషోత్తం, క్లస్టర్ ఇంచార్జ్ వెంకటరమణారెడ్డి, యూనిట్ ఇంచార్జ్ రాజశేఖర్ వర్మ, పచ్చికాపలం గ్రామ కమిటీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, బూత్ కన్వీనర్లు సుధాకర్ రెడ్డి, వెంకటాద్రి, వేణు, సీనియర్ నాయకులు మునిరత్నం రెడ్డి చంగల్ రాయలు, వెంకటేష్ పన్నీర్ యువ నాయకులు ఓబుల్ రెడ్డి, మురళిమోహన్, మీనా, ఢిల్లీ రెడ్డి, రాజేష్, షణ్ముఖ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







