కుప్పంలో ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవం మరియు ఉచిత కంటి వైద్య శిబిరం

కె24న్యూస్ తెలుగు ఆగష్టు 06. చిత్తూరు జిల్లా కుప్పం PES ఆసుపత్రి ఆధ్వర్యంలో మల్లానూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ తల్లిపాల వారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో PES చిన్నపిల్లల వైద్య విభాగం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం, ఆరోగ్య అవగాహన కార్యక్రమం చేపట్టారు. అంగన్‌వాడీ సూపర్వైజర్ ఎన్.శారద మాట్లాడుతూ తల్లిపాలే శిశువుకు తొలి టీకా, తొలి ఆహారం అని అన్నారు. పుట్టిన బిడ్డకు మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, తల్లి–బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి తల్లిపాలు అమూల్యమైనవని వివరించారు. సంజీవిని కార్యక్రమం ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఆరోగ్య సేవలను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ సందర్బంగా ఎమ్మార్పీఎస్ చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షులు ఎం.పీ. ప్రకాష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రజలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, తల్లిపాల ప్రాముఖ్యతను ప్రతి కుటుంబం అవగహన కలిగిఉండాలన్నారు. PES మెడికల్ కాలేజ్ విద్యార్థులు తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రదర్శించిన అవగాహన నాటిక అందరినీ ఆకట్టుకుంది. నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో ప్రజలకు కంటి పరీక్షలు చేసి, శస్త్రచికిత్స అవసరమైన వారిని గుర్తించారు. వారికి PES ఆసుపత్రిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తామని వైద్య బృందం హామీ ఇచ్చింది. ఈ కార్యక్రమంలో డా.పవన్ కుమార్, డా.ఆసనవల్లి, డా.వినీత, సుకన్యా నర్సింగ్ స్టాఫ్, జె.చంద్ర PRO, వి.అంజప్ప PRO, విజయ్ కుమార్ PRA, ఆరోగ్య శాఖ సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్స్, తెలుగుదేశం పార్టీ క్లస్టర్ కో-ఇంచార్జ్ విభూషణ్, పంచాయతీ పార్టీ అధ్యక్షులు రమేష్, మాజీ ఎంపీటీసీ వెంకటప్ప, పంచాయతీ పార్టీ ఉపాధ్యక్షులు రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.