గంగాధరనెల్లూరులో రేపు ఘనంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) సెప్టెంబర్ 01. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జన్మదిన వేడుకలు గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. మండల కేంద్రంలో ఉదయం భారీ బైక్ ర్యాలీ, కేక్ కటింగ్, బాణసంచా కాల్చడం వంటి కార్యక్రమాలు చేపట్టానున్నారు. అనంతరం మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జనసేన పార్టీ మండల అధ్యక్షులు DS@ పి.సురేష్ రెడ్డి తెలిపారు. ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు, వీరమహిళలు, యువత, అభిమానులు విశేష సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు మహేష్ మరియు జనసేన మండల నాయకులు పాల్గొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.