గంగాధరనెల్లూరు శ్రీఆనంద నిలయ అనాధ ఆశ్రమంలో ఘనంగా అన్నదానం!

కె24న్యూస్ తెలుగు ఆగష్టు 08. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం పెద్దమిట్టపల్లిలోని శ్రీఆనంద నిలయ అనాథ ఆశ్రమం సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహించే అన్నదానం, యోగా మరియు ధ్యాన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఆశ్రమ కార్యనిర్వాహకురాలు బండి కృష్ణవేణి పర్యవేక్షణలో ఈ సేవ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా టీడీపీ యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్, మాధవ రెడ్డి,ఫీల్డ్ అసిస్టెంట్ అశోక్, ఇ.త్యాగారాజులు రెడ్డి, ఇ.సుబ్రమణ్యం రెడ్ది, కె.బాబు రెడ్డి, రామక్రిష్ణ రెడ్డి, ఇ.రఘునాథరెడ్డి, దామోదర్ రెడ్డి, బాబు రెడ్ది, జగదీష్, జలజ, విజయ తదితరులు పాల్గొని అన్నదాన చేశారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.