
కె24న్యూస్ తెలుగు ప్రతినిధి (రాజేష్ కుమార్) ఆగష్టు 28. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం గడ్డూరు గ్రామంలో MRPS,MSP మైనార్టీ ఆధ్వర్యంలో వికలాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా MRPS కుప్పం కో-ఇంచార్జ్ పి వెంకటేష్ మాదిగ మాట్లాడుతూ వికలాంగులు జాలి చూపాల్సిన వారు కాదని, హక్కులు, ఆత్మగౌరవం, సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత సమాజం మరియు ప్రభుత్వాలపై ఉందని వికలాంగుల హక్కుల కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ సాగించిన నిరంతర పోరాటం దేశవ్యాప్తంగా వికలాంగుల సమస్యలను ప్రధాన చర్చలోకి తీసుకువచ్చిందని గుర్తు చేశారు. ముఖ్యంగా వికలాంగులకు గౌరవప్రదమైన జీవనం, సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు అందించేందుకు మందకృష్ణ మాదిగ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగా వికలాంగుల సంక్షేమానికి అనేక కీలక నిర్ణయాలు, హక్కుల సాధనకు ఉద్యమాలు బలపడ్డాయని పేర్కొంటూ, ఆ పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఎమ్మార్పీఎస్ కార్యకర్తపై ఉందన్నారు. వికలాంగులకు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లు, ఉపాధి అవకాశాలు, విద్య, స్వయం ఉపాధి రుణాలు, సహాయక పరికరాలు మరియు ఇతర సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎలాంటి వివక్ష లేకుండా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. వికలాంగుల సమస్యలు పరిష్కరించే వరకు, వారి హక్కులు సాధించే వరకు MRPS అండగా నిలుస్తుందని దళిత నాయకులు స్పష్టం చేశారు. వికలాంగులను కేవలం ఒకరోజు మాత్రమే గుర్తు చేసుకోకుండా, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో MSP సీనియర్ నాయకులు గోవింద మాదిగ, MRPS మండల అధ్యక్షుడు విజయ్ కుమార్, రవికుమార్, వికలాంగుల మండల అధ్యక్షుడు వేనన్న, MSP మైనార్టీ మండల అధ్యక్షుడు నాసిర్, వాజిద్, మహమ్మద్, మన్సూర్, సినియర్ నాయకుడు రవి, రంగప్ప, ముత్తు, కార్యకర్తలు, వికలాంగులు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.


