

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) సెప్టెంబర్ 12. గంగాధరనెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం అగ్గిచెనుపల్లి గ్రామానికి చెందిన జనసేన పార్టీ యువనాయకులు నూతన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న జనసేన నాయకులు నూతన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఎన్ఆర్ చందు మాట్లాడుతూ నూతన్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. యువత ఐక్యతతో ముందుకు సాగుతూ సమాజ సేవలో క్రియాశీలకంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు దేవా, కులదీప్, చిరంజీవి, అలాగే నాయకులు సాయి, శంకర్, అల్లు అర్జున్, లాలు, ఓంకార్, మహేంద్ర, ప్రవీణ్ తదితరులు పాల్గొని నూతన్ కు శుభాకాంక్షలు తెలిపారు.


