

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) సెప్టెంబర్ 04. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండల కేంద్రంలోని ఆర్టీఐ అవేర్నెస్ సొసైటీ జాతీయ ఉపకార్యాలయంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ ఆర్టీఐ అవేర్నెస్ సొసైటీ ఫౌండర్ బండి పట్టాభిరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. అధర్మాన్ని అడ్డుకోవడానికి శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారం శ్రీకృష్ణావతారమని ఆయన కొనియాడారు.కురుక్షేత్ర మహాసంగ్రామంలో భగవద్గీతను అందించిన జగద్గురువు శ్రీకృష్ణుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరికి శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.


