దేశ సేవలో పాతికేళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని మోదీ

కె24న్యూస్ తెలుగు  ప్రతినిధి(రాజేష్ కుమార్) సెప్టెంబర్ 16. దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా, సెప్టెంబర్ 17న ప్రతి ఇంటా ఒక ఆశీర్వాద దీపం వెలిగించి ఆయనను ఆశీర్వదించాలని గంగాధరనెల్లూరు మండల బిజేపీ అధ్యక్షులు జి.ఆనందబాబు కోరారు. ముఖ్యమంత్రిగా పదమూడేళ్లు, ప్రధానమంత్రిగా పన్నెండేళ్లుగా ప్రజాసేవలో ఉన్న మోదీకి 140 కోట్ల మంది భారతీయుల తరఫున ఆయన అడ్వాన్స్ గా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన స్థానిక కార్యకర్తలతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం జి. ఆనందబాబు మాట్లాడుతూ మన ప్రియతమ నాయకులు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని రేపు మండల కేంద్రంలోని అల్లెలమ్మ గుడి దగ్గర ఉదయం 8:00 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమం (అర్చన) జరుగును. అనంతరం ఉదయం 9:00 గంటలకు గంగాధరనెల్లూరు బస్టాండ్ కూడలి నందు ప్రధాన మంత్రి మోదీ చిత్రపటానికి పాలాభిషేకం, స్వీట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని. కావున , రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు మండల స్థాయి నాయకులు,వివిధ మోర్చా రాష్ట్ర జిల్లా నాయకులు మరియు మండల మోర్చా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కమిటీ సభ్యులు, శక్తి కేంద్ర ప్రముఖులు మరియు బూత్ అధ్యక్షులు మరియు బిజెపి కార్యకర్తలు మరియు NDA కూటమి నేతలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా గంగాధరనెల్లూరు మండల బిజేపీ అధ్యక్షులు జి.ఆనందబాబు పిలుపునిచ్చారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.