పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు ఎం.పీ. ప్రకాష్ జన్మదిన శుభాకాంక్షలు!

కె24న్యూస్ తెలుగు జూలై 07. అణగారిన వర్గాల గొంతుక, మాదిగ జాతి ఆత్మగౌరవ ప్రతీక పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 61వ జన్మదినం సందర్భంగా MRPS చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షులు ఎం.పీ. ప్రకాష్ ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని, సామాజిక న్యాయ పోరాటాన్ని దేశవ్యాప్తం చేసిన ఆయన నాయకత్వం అభినందనీయం. ఆయనకు పద్మశ్రీ దక్కడం మాదిగ జాతికి గర్వకారణం. మందకృష్ణ మాదిగ సంపూర్ణ ఆయురారోగ్యాలతో, దీర్ఘకాలం ప్రజాసేవలో కొనసాగాలని, ఆయన లక్ష్యాలు సిద్ధింపజేయాలని కోరుకుంటూ ఎం.పీ. ప్రకాష్ హృదయపూర్వక ఆకాంక్షలు వ్యక్తం చేశారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.