
కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) సెప్టెంబర్ 12. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం పెద్దమిట్టపల్లిలోని శ్రీ ఆనంద నిలయ అనాథ ఆశ్రమంలో అన్నదానం, యోగా, ధ్యాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆశ్రమ కార్యనిర్వాహకురాలు బండి కృష్ణవేణి పర్యవేక్షణలో ప్రతి శనివారం ఈ సేవా కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హెడ్ కానిస్టేబుల్ సాయి సుధాకర్, రాజంద్ర, బి.దామోదర్ రెడ్డి, ఆర్టీఐ యాక్టివిస్ట్ బండి పట్టాభిరెడ్డి, రఘునాథరెడ్డి తదితరులు పాల్గొని అనాథలకు భోజనాలు వడ్డించి తమ సేవాతత్పరతను చాటుకున్నారు.


