
కె24న్యూస్ తెలుగు ఆగస్టు 02. చిత్తూరు జిల్లా కుప్పం మండలం మల్లానూరు గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ ప్రజలకు మెరుగైన పారిశుధ్య సౌకర్యాలు కల్పించేందుకు పబ్లిక్ టాయిలెట్ నిర్మాణం కోసం ప్రతిపాదిత స్థలాన్ని టీడీపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గ్రామీణాభివృద్ధి, పారిశుధ్యం, ప్రజారోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మహిళలు, వృద్ధులు మరియు చిన్నారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ కో-ఇంచార్జి విభూషణ్, యూనిట్ ఇంచార్జి దామోదర్, పంచాయతీ పార్టీ అధ్యక్షులు రమేష్, మండల బిసి సెల్ అధ్యక్షులు రాజ్ కుమార్, 233వ బూత్ ఇంచార్జి వెంకటేష్, MRPS చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షులు ఎంపీ ప్రకాష్ పలువురు స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.






