
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం తెలుగు కే న్యూస్ ఆగస్టు 2
యాదమరి మండలం
మండలం కాసిరాళ్ల గ్రామ సమీపంలోని పొదల్లో 2024 ఆగస్టు 4న గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లిన ఆరు ద్విచక్ర వాహనాలను యాదమరి పోలీసులు స్వాధీనం చేసుకుని క్రైమ్ నెం.122/2024, సెక్షన్ 106 BNSS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విచారణలో భాగంగా వాహనాల రిజిస్ట్రేషన్, ఇంజిన్, ఛాసిస్ నంబర్ల ఆధారంగా సంబంధిత మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ల ద్వారా అసలు యజమానులను గుర్తించేందుకు విస్తృతంగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఎలాంటి సమాచారం లభించలేదు. వాహనాల యజమానులు తమ పత్రాలతో యాదమరి పోలీస్ స్టేషన్‌కు రావాలని గతంలో మీడియా ద్వారా పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఎవరూ ముందుకు రాలేదని పోలీసులు తెలిపారు.
దీంతో చట్టపరమైన నిబంధనల మేరకు సంబంధిత మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ద్వారా వాహనాల విలువ అంచనా వేయించి, రెవెన్యూ అధికారుల సమక్షంలో యాదమరి పోలీస్ స్టేషన్ ఆవరణలో 2026 ఆగస్టు 3న ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఎస్సై ఈశ్వర్ వెల్లడించారు







