
కె24న్యూస్ తెలుగు ప్రతినిధి (రాజేష్ కుమార్) సెప్టెంబర్ 12. చిత్తూరు జిల్లా రామకుప్పం మండల పరిధిలోని 89పెద్దూరు గ్రామంలో ఎస్సై మారయ్య ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యువత గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, లేకుంటే ఎన్డీపీఎస్ చట్టం కింద కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. మహిళలపై నేరాలు, పోక్సో, సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం సేకరించి వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.


