యోగాంధ్రను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపు

కె24న్యూస్ తెలుగు (గంగాధరనెల్లూరు నియోజకవర్గం) జూన్ 11. పెనుమూరు మండలంలోని పులిగుండేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఈనెల15న యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లా పర్యాటక మండలి ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు  వెల్లడించారు. ఉదయం 7గంటల నుండి 8గంటల వరకు యోగా కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాంధ్రను విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.