రామకుప్పంలో YS రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు!

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) సెప్టెంబర్ 02.  చిత్తూరు జిల్లా రామకుప్పం మండల కేంద్రంలోని YSR సర్కిల్ నందు డాక్టర్ YS రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన మండల నాయకులు. ఈ సందర్బంగా వైయస్సార్ మండల నాయకులు మాట్లాడుతూ కాలం మారిన పాలకులు మారిన పేదల గుండెల్లో వైయస్సార్ చెరగని ముద్ర చెరిగిపోదని, ప్రజలకన్నీటిని తుడిచిన రాజన్న జ్ఞాపకాలు ప్రతి వర్ధంతికి కాదు ప్రతి పేదవాడి జీవితంలో ప్రతిరోజు కనిపిస్తూనే ఉంటాయని, మహానేత భౌతికంగా దూరమైన ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ ఆలోచనలు రైతుల పక్షపాత విధానాలు పేదల పట్ల చూపిన మానవత్వం ఎప్పటికీ సజీవమే అందుకే వైయస్సార్ పేరు ఒక నాయకుడు పేరు కాదు కోట్ల మంది ప్రజల గుండెల్లో చెరగని చరిత్రను మర్చిపోలేమన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు బాబు రెడ్డి, మాజీ ఎంపీపీ సుబ్రమణ్యం, చంద్రారెడ్డి, మాజీ సర్పంచులు రాజగోపాల్, గోవిందప్ప, సుగుణప్ప, భాస్కర్ నాయక్, ఎంపీటీసీలు రవి నాయక్, చలపతి, మండలంలోని వైయస్సార్ పంచాయతీ ప్రెసిడెంట్లు మనోహర్ రెడ్డి, వైయస్సార్ మండల యూత్ ప్రెసిడెంట్ యశ్వంత్ రెడ్డి, నాయి బ్రాహ్మణుల నాయకుడు శంకర్, సురేష్ రెడ్డి, గణేష్ రెడ్డి, హరి రెడ్డి, మంజునాథ రెడ్డి, మహదూర్ భాష, మహేష్, సీనియర్ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు భారీ సంఖ్యతో పాల్గొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.