

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(పి.రాజేష్ కుమార్) ఆగష్టు 27. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా A.మారెప్ప మంగళవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో MRPS, MSP మరియు మైనార్టీ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించే అంశాలపై చర్చించారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ సమర్థవంతంగా పనిచేయాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుప్పం MRPS-MSP కో ఇంచార్జ్ పి.వెంకటేష్ మాదిగ, MSP కుప్పం సీనియర్ నాయకులు గోవింద మాదిగ, రామకుప్పం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు విజయ్ మాదిగ, రమేష్ మాదిగ,MSP మైనార్టీ మండల అధ్యక్షుడు నాసిర్ భాష, వాజిద్ భాష. మన్సూర్ భాష, ముబారక్ భాషా, ముజ్జు భాష, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


