రెవెన్యూ అధికారులపై వస్తున్న అసత్య వార్తలను ఖండించిన వీఆర్వోలు

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) సెప్టెంబర్ 28. గంగాధరనెల్లూరు మండలంలో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో హాజరైన వీఆర్వోలు తమపై వస్తున్న అసత్య వార్తలను తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాము నిబద్ధతతో పనిచేస్తున్నామని, తప్పుడు కథనాలతో రెవెన్యూ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు వార్తలు ప్రచురించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తహశీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్కు నివేదిక పంపుతామని తహశీల్దార్ స్పష్టం చేశారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.