శ్రీఆనంద నిలయ అనాధ ఆశ్రమంలో ఘనంగా అన్నదానం, యోగా కార్యక్రమాలు!

కె24న్యూస్ తెలుగు జూలై 25. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం పెద్దమిట్టపల్లిలోని శ్రీఆనంద నిలయ అనాధ ఆశ్రమం సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహించే అన్నదానం, యోగా, ధ్యాన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఆశ్రమ కార్యనిర్వాహకురాలు బండి కృష్ణవేణి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. సమాజ సేవలో భాగంగా చేపట్టిన ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రమీల, కె.రామిరెడ్డి, ఇ.రఘునాథరెడ్డి, జగదీష్ రెడ్డి, నరసింహ రెడ్డి, దామోదర్ రెడ్డి, ఆర్టీఐ-ఏఎస్ ఫౌండర్ బండి పట్టాభి రెడ్డి, స్థానిక పాఠశాల విశ్రాంతి ఉపాధ్యాయులు కన్నయ్య పిళ్ళై సతీమణి కె.వనజాక్షి మరియు పలువురు గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొని తమ వంతు సహాయాన్ని అందించారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.