

భక్తులకు అన్నదానం!
కె24న్యూస్ తెలుగు(గంగాధరనెల్లూరు)జూన్12 : చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం నాశంపల్లి గ్రామంలో శ్రీ మాతమ్మ అమ్మవారి దేవాలయ మహా కుంభాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. గ్రామ ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాల కోసం 43 రోజుల పాటు వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక హోమాలు, యాగాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పి.గణేష్ కుమార్ కుటుంబం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.





