PGRS సేవలపై QR కోడ్ ద్వారా స్పందన తెలపాలని కలెక్టర్ పిలుపు!

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) సెప్టెంబర్ 27. ప్రజా సమస్యల పరిష్కార వేదికపై పారదర్శకత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం QR కోడ్ విధానాన్ని తెచ్చింది. జిల్లా, మండల స్థాయి కేంద్రాలలో QR కోడ్ ను ప్రముఖంగా ప్రదర్శించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. PGRS కేంద్రాలను సందర్శించే పౌరుల నుండి అభిప్రాయాన్ని సేకరించేందుకు జిల్లా, మండల స్థాయి PGRS కేంద్రాలలో, వివిధ మాధ్యమాల్లో ప్రజల అభిప్రాయ సేకరణకు QR కోడ్‌ను ప్రదర్శించాలని నిర్ణయించడం జరిగిందని చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా, మండల స్థాయి PGRS కేంద్రాల ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాలలో QR కోడ్ ప్రముఖంగా ప్రదర్శించాలని ఆదేశించారు. QR కోడ్‌ను స్పష్టంగా, కంటికి కనిపించే పరిమాణంలో ముద్రించి, ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. పౌరులు PGRS సేవలను పొందిన వెంటనే తమ మొబైల్ ఫోన్‌ల ద్వారా QR కోడ్‌ను స్కాన్ చేసి తమ అభిప్రాయాన్ని సమర్పించవచ్చని చెప్పారు. ఎక్కువ సంఖ్యలో పౌరులు భాగస్వామ్యం అయ్యే విధంగా నోటీసు బోర్డులు, హెల్ప్ డెస్క్‌లు, ఫిర్యాదుల కౌంటర్లు, తదితర ప్రదేశాల్లో పెట్టాలని సూచించారు. QR కోడ్ వలన ప్రజల స్పందన అధికారిక PGRS పోర్టల్‌ https://pgrs.ap.gov.in/Home/QRGrievance Feedback కు చేరుతుందని అన్నారు. ఆర్జీల స్థితిగతులు తెలుసుకొనుటకు టోల్ ఫ్రీ నంబర్ 1100 కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. PGRS ను వినియోగించుకోవాలని, తమ అభిప్రాయాలను తెలియజేస్తూ మరింత మెరుగైన సేవలు అందించుటకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతీ సోమవారం జిల్లా కలెక్టర్కా ర్యాలయంలోను, మండల కార్యాలయాల్లోనూ నిర్వహించే PGRS లో అర్జీలు అందించండి, వాటిపై మీ స్పందన QR కోడ్ ద్వారా తెలియజేయండని కోరారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.