

సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మారం గ్రామానికి చెందిన సూర నర్సయ్యకు సంబంధించిన జేసీబీ, టిప్పర్ వాహనాలను గుర్తించి స్వాధీనం (సీజ్) చేసుకున్నారు.
అనుమతులు లేకుండా మొరం తవ్వకాలు చేపట్టిన ఘటనపై సూర నర్సయ్యతో పాటు ఇతరులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను అధికారులు వెల్లడించారు.







