అట్టహాసంగా ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి జిల్లా సమావేశం

తిరుపతి, జూలై 15 (తెలుగు కే న్యూస్): తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి జిల్లా కమిటీ సమావేశం ఘనంగా జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు చల్లసాని ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై గణేష్ ఉత్సవాలను హిందూ ఐక్యత, సనాతన ధర్మ పరిరక్షణకు వేదికగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఉత్సవాల నిర్వహణకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు సులభంగా లభించేలా సమితి సమన్వయం చేస్తోందని తెలిపారు. మండపాల్లో అసభ్య పాటలకు బదులుగా భక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులకు ‘లక్ష యువగళ గీతార్చన’ పుస్తకాలను అందజేశారు. రాష్ట్ర కార్యదర్శి చింతగింజల కుమారస్వామి సహా పలువురు జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :