
కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు
అత్యవసరంగా కామారెడ్డి లోని గవర్నమెంట్ హాస్పిటల్ లో డెలివరీ నిమిత్తం తలమడ్ల గ్రామానికి చెందిన గంగిరెడ్డి భువనేశ్వరి అనే గర్భిణీకి ఆపరేషన్ నిమిత్తం అత్యవసరంగా బి నెగటివ్ (B-) గ్రూప్ గల రక్తం అవసరం ఉండగా ఒక్క మెసేజ్ తో రక్తదానానికి ముందుకు వచ్చిన మన కామారెడ్డి 13వ వార్డు (టేక్రియాల్) కు చెందిన గడ్డమీది నరేష్ హుటాహుటిన వచ్చి తన 9వ సారి రక్తదానం చేయడం జరిగింది.
ఈ సందర్బంగా రక్త దాత గడ్డమీది నరేష్ మాట్లాడుతూ 9వ సారి రక్తదానం చేయడం ఆనందంగా ఉందని తెలిపారు
అత్యవసర పరిస్థితులలో రక్తదానం చేసిన రక్తదాతకు గర్భిణీ స్త్రీ యొక్క కుటుంబ సభ్యులు మరియు తలమడ్ల గ్రామ ఉపసర్పంచ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్వాల సతీష్ , వెంకట్, గర్భిణీ స్త్రీ యొక్క కుటుంబ సభ్యులు, గంగిరెడ్డి కృష్ణ మరియు బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొన్నారు.





