
కరీంనగర్ తెలుగు కే న్యూస్ ఆగస్టు 28
కరీంనగర్ రక్షాబంధన్ పండుగను పురస్కరించుకొని రక్షాబంధనం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు, విద్యార్థులు, పెద్దలు పరస్పరం రాఖీలు కట్టుకొని సోదరభావం, ఆత్మీయత, ఐక్యతను చాటుకున్నారు ఈ కార్యక్రమంలో పెద్దలు విద్యార్థులకు రక్షాబంధన్ పండుగ ప్రాముఖ్యతను వివరిస్తూ, పరస్పర గౌరవం, ప్రేమ, సహకారం , సోదర భావంతో మెలగాలని సూచించారు ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ రక్షాబంధనం కేవలం రాఖీ కట్టుకునే పండుగ మాత్రమే కాదు మన మధ్య ఉన్న ప్రేమ, బాధ్యత, రక్షణ భావాలకు ప్రతీక అని తెలిపారు ఈ కార్యక్రమంలో కొడ్రా అబిలాష్ మమత,రాంబాబు,బూర్ల మొగిలి, సుమన్ పటేల్,అరుణ్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు.


