అనుమతులు కొన్ని అంతస్తులకి అదనపు అంతస్తుల భవనాలు లెక్క లేనన్ని.. చోద్యం చూస్తున్న జి హెచ్ ఎం సి అధికారులు..

జంగ్ పేరుతో ఫిర్యాదు దారులకళ్ళు గప్పి నిర్మాణాలు పూర్తి..

శేరిలింగంపల్లి తెలుగు కె న్యూస్ : శేరిలింగంపల్లి 49 సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో అనుమతికి మించి అదనపు అంతస్తులు నిర్మిస్తున్న వారు ఇచ్చే ముడుపులు తీసుకొని చేతులు దులుపు కున్న టౌన్ ప్లానింగ్ అధికారులు. ఇక ఇది తమ పని కాదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇలాంటివి శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోనీ రాఘవేంద్ర కాలని, రాజరాజేశ్వరి కాలని, శ్రీరామ్ నగర్ ఏ.బి.సి బ్లాకులు, గచ్చిబౌలి, అంజయ్య నగర్, రోలింగ్ హిల్స్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ప్రాంతాల్లో.అక్రమ నిర్మాణాల దారులకు అండగా నిలుస్తున్న అధికారుల పై నిఘా ఉండాలని ప్రజలు అంటున్నారు. ఇలాంటి అడ్డదారిలో డబ్బులకు కక్కుర్తి పడి అక్రమ నిర్మాణాలపై చ…