

శివాలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి ముందు విఘ్నేశ్వరుని రూపం కనిపించడం శుభసూచకమని భావించిన గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే పలువురు భక్తులు అక్కడికి చేరుకుని దర్శించుకున్నారు.
ఇది యాదృచ్ఛికంగా ఏర్పడిన ఆకారమా, లేక పరమేశ్వరుని సన్నిధిలో విఘ్నేశ్వరుడి దివ్య సంకేతమా అని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీమతి గైని వసంత సతీష్‌తో పాటు గ్రామ పెద్దలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
అభంగపట్నం శివాలయ ప్రాంగణంలో కనిపించిన ఈ అరుదైన దృశ్యం ప్రస్తుతం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.


