అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి | K24 న్యూస్ తెలుగు

కామారెడ్డి పట్టణంలోని రాజీవ్‌నగర్ కాలనీ, డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పాల్గొన్నారు. పోలీసు-ప్రజల భాగస్వామ్యంతో నేరాల నివారణే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు.
తనిఖీల్లో 121 ద్విచక్ర వాహనాలు, 36 ఆటోలు, 2 కార్లు, ఒక తల్వార్, 18 బీర్ బాటిళ్లు, 12 క్వార్టర్ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న 11 వాహనాలను గుర్తించారు.
సోషల్ మీడియాలో కత్తులు, మారణాయుధాలతో పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఎస్పీ, గంజాయి, సైబర్ మోసాలు, రోడ్డు భద్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే డయల్-100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.