ఊర కుక్క దాడిలో నలుగురికి గాయాలు

భీమారం, తెలుగు కె న్యూస్ సెప్టెంబర్ 27: మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో ఊర కుక్క దాడి చేసి పలువురిని గాయపరిచిన ఘటన స్థానికంగా ఆందోళనకు గురిచేసింది. మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల సమీపంలో శనివారం ఓ నల్ల కుక్క ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారిపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు.ఒక గంట వ్యవధిలో నలుగురిని కరిచి గాయపరిచినట్లు సమాచారం. గాయపడిన వారిలో భీమారం గ్రామానికి చెందిన మారం రవి, దంపూర్‌కు చెందిన కుమ్మరి అశోక్, కోడెపే ఎర్రయ్య, కోడెపే అశ్రుతనందు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.కుక్క కాటుకు గురైన బాధితులు చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కుమ్మరి అశోక్‌కు గాయం తీవ్రంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.వరుసగా కుక్క దాడులు జరుగుతున్న నేపథ్యంలో గ్రామపంచాయతీ అధికారులు స్పందించి వీధి కుక్కల బెడదను నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.