ఎల్ఐసి లో class-3 class-4 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వెంటనే జారీ చేయాలని డిమాండ్

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి లో OFS ద్వారా వాటాల విక్రయానికి వ్యతిరేకంగా మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఐసీఈయు కామారెడ్డి వారి ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చేయడం జరిగింది. OFS పద్ధతి ద్వారా ఎల్ఐసి లో ప్రభుత్వం 6.5% వాటాల విక్రయాన్ని వ్యతిరేకిస్తూ, దీనివలన ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసి లో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం పెరిగపోతుందని, దానివలన పాలసీదారులకు రావలసిన లాభాలు మరియు ప్రయోజనాలు తగ్గిపోతాయని, అందుకు నిరసనగా ఐసీఈయూ కామారెడ్డి ఈ ప్రభుత్వ చర్యను ఖండిస్తూ ధర్నా చేయడం జరిగింది. అలాగే న్యూ లేబర్ కోడ్స్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎల్ఐసి లో వెంటనే CLASS -3 మరియు class -4 రిక్రూట్మెంట్ కు నోటిఫికేషన్ జారీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐసియు కామారెడ్డి సెక్రెటరీ నాగేశ్వరరావు, ప్రెసిడెంట్ నర్సింలు, సునీల్, భరత్, సంజయ్, నైముద్దీన్, వెంకటరాజ్యం తదితరులు పాల్గొన్నారు

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.