
కొత్తగూడెం: తెలుగు కే న్యూస్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సింగరేణి ఎస్టిపిపీ ఏరియా నుంచి ముగ్గురు ఉత్తమ ఉద్యోగులను ఎంపిక చేశారు. సీనియర్ అసిస్టెంట్ మెరుగు రాజ్‌కుమార్‌ను ఉత్తమ సింగరేణీయన్గా ఎంపిక చేయగా, కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో జరిగే కేంద్ర వేడుకల్లో సింగరేణి సీఎండీ డా. బుద్ధ ప్రకాష్ జ్యోతి చేతుల మీదుగా సన్మానం అందుకోనున్నారు.
అలాగే సీనియర్ అసిస్టెంట్ లక్కోజు బాలసుబ్రహ్మణ్యం, వార్డు అసిస్టెంట్ అడ్డూరి కిరణ్‌కుమార్‌లను ఎస్టిపిపీ స్థాయి ఉత్తమ ఉద్యోగులుగా ఎంపిక చేశారు. వీరిని ఎస్టిపిపీ వేడుకల్లో సన్మానించనున్నారు. ఉద్యోగులను ఈడీ సీహెచ్. చిరంజీవి, జీఎంలు ఎం. నరసింహారావు, కే. సూర్యనారాయణరాజు అభినందించారు.


