కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య లక్షెట్టిపేటలో విషాద ఘటన


లక్షెట్టిపేట, తెలుగు కె న్యూస్ సెప్టెంబర్ 19:
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని భగత్‌సింగ్‌నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన గుర్రాల జయకర్ (40) ఇంటి సమీపంలోని వేప చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు.పోలీసుల వివరాల ప్రకారం.. జయకర్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో శుక్రవారం ఇంట్లో గొడవలు జరిగినట్లు తెలిపారు. అనంతరం జయకర్ తన సోదరులకు ఫోన్ చేసి, ఇంట్లో తరచూ కుటుంబ కలహాలు జరుగుతున్నాయని, తనకు బతకడం ఇష్టం లేదని చెప్పినట్లు సమాచారం.ఆ తర్వాత జయకర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి సోదరుడు గుర్రాల చంద్రమౌళి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గొపతి సురేష్ తెలిపారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.