నిజామాబాద్ జిల్లా,నవీపేట: మండల కేంద్రంలోని ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల్లో శనివారం పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో వెంకటరమణ, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో నాగరాజు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం అధికారులు, సిబ్బంది జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని అధికారులు సూచించారు. కార్యక్రమాల్లో ఆయా కార్యాలయాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Post Views:62
కె24 న్యూస్ తెలుగు
Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.