

ఈ సందర్భంగా అమీర్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన కిరణ్, వారికి ధైర్యం చెప్పి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కుటుంబం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో తన వంతు సహకారాన్ని అందించడం మానవత్వానికి నిదర్శనమని స్థానికులు అభినందించారు.
కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ మండల అధ్యక్షులు వి. నర్సింగ్ రావు, బోధన్ టౌన్ అధ్యక్షులు రఫీందర్ యాదవ్, అభంగపట్నం గ్రామ సర్పంచ్ గిన్నె వసంత సతీష్ గౌడ్, సీనియర్ నాయకులు బెల్లాల్ నర్సింగ్ రావు, ఆలాగే నాయకులు మంత గంగన్న, మంత సాయిబాబా, ఈర్ల సాయిని, రెమ్మ పోచయ్య, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు తోడుగా నిలుస్తూ, ఆపన్నులకు అండగా ఉండాలని పలువురు కోరారు.


