గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా కామారెడ్డి పట్టంలో ట్రాఫిక్ డైవర్షన్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి జిల్లా సెప్టెంబర్ 23 :k24 న్యూస్ తెలుగు : కామారెడ్డి పట్టణంలో 23-09-2025 సాయంత్రం 6:00 గంటల నుండి గణేష్ నిమజ్జన శోభాయాత్ర నిర్వహించబడనున్నది. ఈ సందర్భంగా పట్టణంలో వాహనాల రాకపోకలకు తాత్కాలిక ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేయబడనున్నాయి.
భక్తుల భద్రత, శోభాయాత్ర ప్రశాంతంగా మరియు విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజలు, వాహనదారులు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి.
1. కరీంనగర్ / సిరిసిల్ల వైపు నుండి కామారెడ్డి పట్టణంలోకి వచ్చే వాహనాలు:
సిరిసిల్ల బైపాస్ → NH-44 → టేక్రియాల్ బైపాస్ మార్గం ద్వారా కామారెడ్డి పట్టణంలోకి ప్రవేశించవచ్చు.
2. కామారెడ్డి నుండి కరీంనగర్ / సిరిసిల్ల వైపు వెళ్లే వాహనాలు: కొత్త బస్టాండ్ → ఇందిరాగాంధీ స్టేడియం → టేక్రియాల్ బైపాస్ → NH-44 → సిరిసిల్ల బైపాస్ మార్గం ద్వారా వెళ్లాలి.
3. కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ వైపు వెళ్లే వాహనాలు: కొత్త బస్టాండ్ → అశోక్‌నగర్ → రైల్వే గేట్ వరకు వచ్చి,
మార్గం–1:
కలెక్టర్ కార్యాలయం → గుమస్తా కాలనీ → రామారెడ్డి వైపు వెళ్లవచ్చు.
మార్గం–2:
ఓం శాంతి భవనం → రాజీవ్‌నగర్ → టీచర్స్ కాలనీ → ఇంద్రనగర్ కాలనీ వైపు వెళ్లవచ్చు.
4. హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు:
యథావిధిగా పాత మార్గం ద్వారానే వెళ్లవచ్చు.
5. హైదరాబాద్ / పాత రాజంపేట వైపు నుండి కామారెడ్డి పట్టణంలోకి వచ్చే వాహనాలు:
టేక్రియాల్ బైపాస్ → ఇందిరాగాంధీ స్టేడియం → కొత్త బస్టాండ్ మార్గం ద్వారా పట్టణంలోకి ప్రవేశించవచ్చు.
ముఖ్యమైన సూచనలు
23-09-2025 సాయంత్రం 6:00 గంటల నుండి నిమజ్జన శోభాయాత్ర పూర్తయ్యే వరకు భారీ వాహనాలకు కామారెడ్డి పట్టణంలోకి ప్రవేశం ఉండదు.
శోభాయాత్ర జరిగే మార్గంలో ఎలాంటి వాహనాలకు అనుమతి ఉండదు.
ట్రాఫిక్ డైవర్షన్లు నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు అమల్లో ఉంటాయి.
వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగిస్తూ పోలీసులకు సహకరించాలని ఎస్పీ తెలిపారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.