నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండల్ :-మద్దేపల్లి గ్రామంలోని అంగన్వాడీ సెంటర్ విజిట్ కి సూపర్వేజర్ భాగ్యలక్ష్మి మేడం రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో CB Events లో భాగంగా శ్రీమంతం చేయడం జరిగింది అలాగే అంగన్వాడీ స్కూల్ పిల్లలకు ఈ నెలలో సంభాషణ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి ప్రదర్శనం ద్వారా చెప్పడం జరిగింది మరియు చిన్నారులను అంగన్వాడీ కేంద్రమునకు పంపించాలి అని గర్భిణీ బాలింతలు ప్రతి రోజు అంగన్వాడీ సెంటర్ కి వచ్చి భోజనం చేయాలి అని అలాగే గర్భవతులు ప్రసవానికి గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళాలి అని తల్లులను కోరడం జరిగింది ఈ కార్యక్రమం లో గర్భిణీలు, బాలింతలు, పిల్లలు, తల్లీలు, మరియు కిషోరబాలికలు మరియు అంగన్వాడీ టీచర్స్ స్వప్న, నిర్మల,తదితరులు పాల్గొన్నారు
Post Views:40
కె24 న్యూస్ తెలుగు
Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.