టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌ను కలిసిన మాచారెడ్డి సర్పంచ్

కామారెడ్డి, జూలై 17 (K24 న్యూస్): టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని కామారెడ్డిలోని ఆయన నివాసంలో మాచారెడ్డి గ్రామ సర్పంచ్ రావుల వినోద్-ప్రభాకర్, ఉప సర్పంచ్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా గడ్డం చంద్రశేఖర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో కాకులగుట్ట సర్పంచ్ భూక్యా రాజు, ఉప సర్పంచ్ నరేష్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :