టీ.జె.ఏ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు జర్నలిస్టులంతా తప్పనిసరిగా హాజరుకావాలి: జిల్లా అధ్యక్షుడు పోత్తూరి అంజి

సిద్దిపేట, K24 న్యూస్ జూలై 21:
తెలంగాణ జర్నలిస్టుల అసోసియేషన్ (TJA) 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 23న నిర్వహించనున్న రాష్ట్రస్థాయి వేడుకలకు సిద్దిపేట జిల్లా పరిధిలోని అన్ని మండలాల జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీ.జె.ఏ జిల్లా అధ్యక్షుడు పిలుపునిచ్చారు.
జర్నలిస్టుల ఐక్యత, హక్కుల పరిరక్షణ, వృత్తి అభివృద్ధి కోసం టీ.జె.ఏ నిరంతరం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జర్నలిస్టులందరికీ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని, ప్రతి మండలం నుంచి సభ్యులు, పాత్రికేయులు తప్పనిసరిగా పాల్గొని సంఘానికి తమ సంఘీభావాన్ని తెలియజేయాలని కోరారు.
వేడుకలకు హాజరయ్యే జర్నలిస్టులు సమయపాలన పాటిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు విజ్ఞప్తి చేశారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.