
కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు
కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని టేక్రియల్ చివరలో డ్రంక్ అండ్ డ్రైవ్ నివారణకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ డ్రైవ్ లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఐదుగురుని గుర్తించి వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు దేవునిపల్లి ఎస్సై రంజిత్ తెలిపారు. వీరిని కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు


