నవీపేట్‌లో విద్యుత్ సరఫరాకు అంతరాయం.. మరమ్మతుల నేపథ్యంలో 7 గంటల పాటు కరెంట్ కట్

నిజామాబాద్ జిల్లా,
నవీపేట్ మండలం :- యంచా 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మరమ్మతు పనుల కారణంగా గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ జి. ప్రశాంత్ తెలిపారు.
ఈ అంతరాయం యంచా విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని యంచా, అల్జాపూర్, నందిగామ గ్రామాలకు వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :