పంచాయతీ సిబ్బందికి యూనిఫామ్, పారిశుధ్య సామగ్రి పంపిణీ

తెలుగు కే న్యూస్ కోహెడ: మండలంలోని వింజపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి యూనిఫామ్‌ కోసం కొత్త బట్టలు, పారిశుధ్య సామగ్రి, పనిముట్లను బుధవారం పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ అన్నాడి శ్రీజ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బందికి అవసరమైన సామగ్రిని అందజేశారు.ఈ సందర్భంగా గ్రామంలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచడంతో పాటు సిబ్బంది విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సహకారం అందిస్తున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గుర్రం రాజిరెడ్డి, ఉపసర్పంచ్ రంగనవేణి వెంకటస్వామి, పాలకవర్గ సభ్యులు మంద స్రవంతి-ధర్మేందర్, చిట్యాల కవిత-సంపత్, అన్నాడి రాజేందర్‌రెడ్డి, మోర వైశాలి-రాజు, గర్రెపల్లి వేణుగౌడ్, కొమ్ముల దీప్తి-సునీల్‌రెడ్డి, ద్యాగటి సతీష్, బోదాసు తిరుపతి, అక్కరవేణి సంపత్, గ్రామ కారోబార్ బొమ్మడవేని ఆంజనేయులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

 

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.