
కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు
విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేలా “పక్షులు – పర్యావరణ స్పృహ” అంశంపై సైన్స్ ప్రాజెక్టులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు.
మంగళవారం దోమకొండ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రతి విద్యార్థి పర్యావరణ స్పృహను పెంపొందించుకుని ప్రకృతి, పక్షుల సంరక్షణలో తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. పక్షులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం, మొక్కలు నాటడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి అలవాట్లు అలవరుచుకోవాలని సూచించారు.





