పటేల్ చెరువును సుందరీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం: పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి:K24 న్యూస్ తెలుగు మియాపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువులో గుర్రపు డెక్క తొలగింపు, దోమల నియంత్రణ కోసం డ్రోన్ ద్వారా హానికరం కాని కలుపు మందు పిచికారీ కార్యక్రమాన్ని పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ, చెరువును పూర్తిస్థాయిలో శుభ్రపరచి సుందరీకరించడంతో పాటు వాకింగ్ ట్రాక్, ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తామని తెలిపారు. అలాగే తామర పువ్వులను పెంచి చెరువును మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని, నియోజకవర్గంలోని అన్ని చెరువులను దశలవారీగా అభివృద్ధి చేసి కబ్జాల నుంచి రక్షిస్తామని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీవాసులు, వాకర్స్ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :