పసిఫిక్ భయపెడితే.. బంగాళాఖాతం అభయమిచ్చింది

తెలుగు కే న్యూస్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇటీవల పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నీనో ప్రభావంతో వర్షాలు తగ్గి, తీవ్ర ఎండలు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో పరిస్థితి మారింది. తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40–50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.