పాడి రైతుల పిల్లలకు కరీంనగర్ పాలడైరీ స్కాలర్‌షిప్‌లు

ఉన్నత విద్యతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్ష

బెజ్జంకి, జూలై 13 (కె24 న్యూస్):
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కరీంనగర్ పాలడైరీలో పాలు సరఫరా చేసే పాడి రైతుల కుటుంబాల విద్యార్థులకు కరీంనగర్ పాలడైరీ ఆధ్వర్యంలో సోమవారం స్కాలర్‌షిప్‌లను పంపిణీ చేశారు.
గుగ్గిళ్ల గ్రామంలోని పాలడైరీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో కరీంనగర్ పాలడైరీ అధ్యక్షులు కేడిక మాధుసూదన్ రెడ్డి, మేనేజర్ సుధాకర్, సైట్ సూపర్‌వైజర్ ధన్‌రాజ్ విద్యార్థులకు స్కాలర్‌షిప్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పాడి రైతుల కుటుంబాలకు చెందిన విద్యార్థులు విద్యారంగంలో రాణించి ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. రైతు కుటుంబాల పిల్లల విద్యాభివృద్ధికి అండగా నిలవడం కరీంనగర్ పాలడైరీ సామాజిక బాధ్యతలో భాగమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా రైతు సంక్షేమంతో పాటు విద్యార్థుల అభ్యున్నతికి ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాడి రైతులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాలడైరీ ప్రతినిధులు పాల్గొన్నారు

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.