పీఏసీఎస్‌ చైర్మన్‌ను కలిసిన ఏకలవ్య యూత్ సంఘం ప్రతినిధులు

బెజ్జంకి, తెలుగు కే న్యూస్ సెప్టెంబర్ 22:
బెజ్జంకి మండల ఏకలవ్య యూత్ సంఘాన్ని నూతనంగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో సంఘం ప్రతినిధులు మంగళవారం బెజ్జంకి మండల పీఏసీఎస్‌ చైర్మన్ ఒగ్గు దామోదర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటైన యూత్ సంఘం కార్యకలాపాలు, యువతకు సంబంధించిన అంశాలపై చర్చించారు.ఈ నెల 20న ఏకలవ్య యూత్ సంఘాన్ని నూతనంగా ఏర్పాటు చేసినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. అనంతరం సంఘం సభ్యులు మండల అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ రావుల నరసయ్య, మండల టౌన్ ప్రెసిడెంట్ కత్తి రమేష్, జెల్లా ప్రభాకర్, బోనగిరి శ్రీనివాస్ తదితరులను కూడా మర్యాదపూర్వకంగా కలిశారు.ఏకలవ్య యూత్ సంఘం మండల అధ్యక్షుడిగా బండి సంపత్ (బెజ్జంకి), ఉపాధ్యక్షుడిగా కోనేటి తిరుపతి (గుండారం), ప్రధాన కార్యదర్శిగా కట్ట శ్రీనివాస్ (ముత్తన్నపేట), కోశాధికారిగా బండి రాజేశం (బెజ్జంకి), రైటర్‌గా కోనేటి శ్రీకాంత్ (గుండారం), ప్రచార కార్యదర్శిగా బండి సంపత్ (రేగులపల్లి), సోషల్ మీడియా ఇన్‌చార్జిగా కట్ట రాజమౌళి (గుగ్గిల) ఎన్నికైనట్లు తెలిపారు.సంఘం సభ్యులుగా భునాద్రి మహేందర్ (గాగిల్లాపూర్), బండి సమ్మయ్య (బెజ్జంకి) తదితరులు కొనసాగుతున్నారు. మండలంలోని యువతను సంఘటితం చేసి సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.