
కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు :జిల్లా కేంద్రంలోని ఆర్&బి గెస్ట్ హౌస్ లో జరిగిన సమావేశం లో నాయకులు మాట్లాడుతూ
జనగణన లో కులగణనను తప్పనిసరి చేస్తూ ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలని డిమాండ్ చేశారు.శాస్త్రీయ పద్ధతిలో జనగణన చేపట్టకపోతే వేల కోట్ల ప్రజాధానం వృధా అవుతుందని అన్నారు.ప్రతీ కులాన్ని నమోదు చేసేలా పారదర్శక విధానంలో లెక్కింపు జరగాలని అన్నారు.
దేశవ్యాప్తంగా జరిగే జాతి జనగణలో బీసీ కులగణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకొని ప్రకటించింది.
కానీ ఇప్పుడు కులగనన శాస్త్రీయమైన పద్ధతిలో చేయకుండా,ఓబీసీ కుటుంబాలను లెక్కించకుండా,బీసీ కాలం లేకుండానే,రెండవసారి కూడా జాతీయ జన గణన ఆగస్టు 17వ తేదీ నుండి ప్రారంభం మొదలుపెట్టింది.
కొంత మంది బిసి వ్యతిరేకులు బీసీ కులగననను తప్పుదారి పట్టించడానికే రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం చేపడుతున్నారు.
రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం చేసేవాళ్లంత దేశద్రోహులే అని అన్నారు.
రిజర్వేషన్ల కృత్తిమ వ్యతిరేక ఉద్యమాన్ని నడిపించే వాళ్ళ భరతం పడతాం అన్నారు.దేశంలో బీసీ,ఎస్సీ,ఎస్టీ సామాజిక రిజర్వేషన్లను రద్దు చేయాలని ఢిల్లీలో ఆందోళన చేపట్టడం చాలా సిగ్గుచేటని,80 ఏళ్లుగా దేశాన్ని పందికొక్కుల దోచుకున్న వాళ్ల వారసులే రిజర్వేషన్ల వ్యతిరేక కృతిమ ఉద్యమాన్ని నడిపిస్తున్నారని అన్నారు.
దేశవ్యాప్తంగా జరిగే జాతి జనగణలో బీసీ కులగలను చేపట్టి బీసీ కులాల లెక్కలను జనాబా దామాషా పద్ధతిన బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు తగ్గాలని ఒక వైపు దేశవ్యాప్తంగా బీసీలు పోరాడుతుంటే బీసీ కులగనన కనుమరుగు చేసి, బీసీలను తప్పుదారి పట్టించడానికి దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వేషన్ వ్యతిరేకులు గత కొన్ని నెలలుగా ఆన్ లైన్ ద్వారా ఇప్పుడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉద్యమాన్ని చేపడుతున్నారని, నాటి మండల్ ఉద్యమంలో రిజర్వేషన్లు వ్యతిరేకించిన వారి వారసులే ఈరోజు సామాజిక రిజర్వేషన్ లు రద్దు చేయాలని రిజర్వేషన్ వర్గాలైన బీసీ ఎస్సీ ఎస్టీ లపై విషం కక్కుతున్నారని ఆయన ఆరోపించారు
రిజర్వేషన్లను వ్యతిరేకించే వాళ్ళు మొదటగా రాజ్యాంగానికి విరుద్ధంగా అమలవుతున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేయాలని ఆ తర్వాతనే సామాజిక రిజర్వేషన్లపై చర్చ పెట్టాలని కోరారు, రిజర్వేషన్లపై ప్రతిరోజు కుట్రలు చేస్తున్న వారికి ఒకటి సవాల్ చేస్తున్నాo, రిజర్వేషన్లు రద్దు కావాలని మేము కూడా కోరుకుంటున్నాం కానీ దేశ సంపదను, దేశంలోని సహజ వనరులను పందికొక్కుల దోస్కతిన్న కార్పొరేట్ దిగ్గజాలు, పెట్టుబడుదారులు, భూస్వాములు మొదలుకొని అందరి ఆస్తి హక్కులను రద్దుచేసి, దేశ సంపదను జాతీయం చేసి జనాభా దామాషా ప్రకారం సమానమైన పంపిణీ చేపట్టిన తర్వాత రిజర్వేషన్లు రద్దు చేసుకోవచ్చని సవాల్ విసిరారు.
ఈ కార్యక్రమం లో
ప్రధాన కార్యదర్శి కుంభాల లక్ష్మణ్ యాదవ్,మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు బాజా లలిత,జిల్లా ఉపాధ్యక్షులు మారోజు మొహనా చారి సిహెచ్ రాజయ్య లింగమాచారి జిల్లా చేపూరి వెంకట్ స్వామి తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం జనరల్ సెక్రెటరీ వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య సిహెచ్ నరసింహులు నర్సింలు జి శ్రీనివాస్ బి నవీన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవ అంబేద్కర్ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కే మల్లన్న,పూసల సంఘం జిల్లా గోలిపల్లి మహేష్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోశెట్టి సాయి కృష్ణ,చింతల పోషవ్వ
తదితరులు పాల్గొన్నారు.


