ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం సందర్భంగా వ్యాసరచన పోటీలు

 

కోహెడ, తెలుగు కె న్యూస్ జూలై 15 : యువ ప్రపంచజన నైపుణ్య దినోత్సవం సందర్భంగా మీరా యువభారత్, సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో కోహెడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో “దేశ అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర” అంశంపై వ్యాసరచన పోటీలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, యువజన అవార్డు గ్రహీత వలస శుభాష్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. యువత నైపుణ్యాలే నవభారత నిర్మాణ పునాదని, ముఖ్యంగా డిజిటల్ నైపుణ్యాలు, కృత్రిమ మేధస్సు (AI) వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై యువత దృష్టి సారించిందని పేర్కొన్నారు. విద్యార్థుల లక్ష్యంతో చదువుకుని తమ నైపుణ్యాలను దేశాభివృద్ధికి వినియోగించాలని.
కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఉన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.