ప్రసన్నాంజనేయ రెడ్డి సంఘం అధ్యక్షులుగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఏకగ్రీవ ఎంపిక

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు

ప్రసన్నాంజనేయ రెడ్డి సంఘం కార్యవర్గ సభ్యులు సంఘం తరఫున ఏకగ్రీవంగా అధ్యక్షులుగా ఎన్నుకోబడిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ని ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, రెడ్డి సంఘం అభ్యున్నతికి ఇప్పటివరకు అందించిన సహకారాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తూ, సంఘం చేపట్టబోయే సామాజిక సేవా కార్యక్రమాలకు అండగా నిలవాలని అధ్యక్షులను కోరారు.

సంఘం ఉపాధ్యక్షులు నర్సారెడ్డి మాట్లాడుతూ, రెడ్డి సంఘం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కి సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.

అనంతరం గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రెడ్డి సంఘం చేపట్టే ప్రతి కార్యక్రమంలో ముందుండి పాల్గొంటానని, సంఘ అభివృద్ధి కోసం తమ వంతు సహాయ సహకారాలను ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ , సంఘం అధ్యక్షులు లక్ష్మారెడ్డి , ప్రధాన కార్యదర్శి రామచంద్రరెడ్డి , ఉపాధ్యక్షులు, కోశాధికారి, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు మరియు సంఘ బాధ్యులు పాల్గొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.