బాసర మూలమలుపు గుంతలు నిండిన రహదారి.. ప్రయాణికులకు నిత్యం ఇబ్బందులు

నిజామాబాద్ జిల్లా,నవీపేట్ మండల కేంద్రంలో :-నుంచి బాసర మూలమలుపు వైపు వెళ్లే ప్రధాన రహదారిపై భారీ గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బాసర మూలమలుపు సమీపంలోని సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడి ఇంటి వద్ద రహదారి పూర్తిగా దెబ్బతినడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గుంతలు మరింత విస్తరించాయని, ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు, పాదచారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. వెంటనే రహదారికి మరమ్మతులు చేపట్టి గుంతలను పూడ్చివేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.